ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ఫలితంగా మందుల ధరలు తగ్గాయని, ఈ కొత్త ధరల ప్రకారమే మందుల అమ్మకాలు జరపాలని జిల్లా డ్రగ్ కంట్రోలర్ జి సునీత సూచించారు. నరసరావుపేట జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తగ్గిన ధరల ప్రకారం మందులు అమ్మకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.