డ్వాక్రా రుణాలపై నివేదిక సమర్పించండి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో అందిస్తున్న డ్వాక్రా రుణాలు, జీవనోపాధి కార్యక్రమాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్సార్ శంకరన్ వీడియోకాన్ఫరెన్స్ హాలులో గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రణాళికపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మంజూరైన రుణాలు, పెండింగ్లో ఉన్న రుణాలు, రుణాల మంజూరుకు ఎదురవుతున్న సమస్యలపై నివేదిక కోరారు.

సంబంధిత పోస్ట్