శనివారం సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు రోడ్డులోని బట్టీల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.