పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో శనివారం రైతులు యూరియా ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అవసరమైన యూరియా సకాలంలో అందక, రైతులు రాత్రింబగళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం సరఫరాలో విఫలమవడంతో, రైతులు పంట పనులు ఆపి ఎరువుల కోసం క్యూలలో నిలబడాల్సి వస్తోంది.