వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్డులో ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఆదివారం కూడా బిల్లులు చెల్లించుకోవచ్చని ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణంగా సెలవు దినం అయినప్పటికీ, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలోని విఆర్ఆ ఆఫీసులో కరెంటు బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏడీఈ కోరారు. ఈ సౌకర్యం ఆదివారం నుండి అందుబాటులో ఉంటుంది.