AP: రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఆధునిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత సులభంగా జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ కొత్త ఈవీఎంలలో ఒకే యంత్రాన్ని రెండు, మూడు దశల్లో జరిగే ఎన్నికలకు కూడా వాడొచ్చని వివరించారు. ప్రభుత్వం కూడా దీనికి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లకు బదులుగా ఈవీఎంలతో జరిగే అవకాశం ఉంది.