మన్యం జిల్లా పాలకొండకు చెందిన ఈట్ల రమేష్ శుక్రవారం ఉదయం ప్రతిరోజు మాదిరిగా వాకింగ్ కు వెళ్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన వైజాగ్ లో మెడికల్ రిప్రజెంటివ్ గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటా హుటిన విశాఖపట్నం బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.