శనివారం ఉదయం జియ్యమ్మవలస మండలం పెదకుదమ సమీపంలోని చెరువు వద్ద ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీనితో పరిసర గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల సంచారం వల్ల పంటలు నాశనమవుతున్నాయని, ప్రతిరోజూ భయంతో బతుకుతున్నామని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులను తమ ప్రాంతం నుంచి తరలించాలని వారు కోరుతున్నారు.