కురుపాం మండల కేంద్రంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్రమ మద్యం విక్రయాలపై శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సూర్యనారాయణను అదుపులోకి తీసుకొని, 6 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా, బెల్ట్ షాపులు నడుపుతున్న మరో ఐదుగురిని తహసిల్దార్ ముందు హాజరుపరిచి, వారిపై రూ.2 లక్షల బైండోవర్ చర్యలు చేపట్టారు.