పార్వతీపురంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

పార్వతీపురం పరిసరాలలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వరద నీటితో చెరువును తలపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువలు కూడా వరద నీటితో ఉప్పొంగాయి. అయితే, వర్షం తర్వాత వాతావరణం చల్లబడటంతో పట్టణవాసులు కొంత ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్