ఆశా కార్యకర్త బంగారమ్మకు సీఎం ప్రశంస

మొంథా తుపాను సమయంలో అపార సేవలందించిన మెంటాడ మండలం లక్ష్మీపురం ఆశా కార్యకర్త వై. బంగారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. జోరువాన, ఉధృతంగా ప్రవహిస్తున్న చంపావతి నదిని దాటి ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణి మీసాల పార్వతిని ఆసుపత్రికి చేర్చిన బంగారమ్మ సేవలను కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె త్యాగం, ధైర్యం సీఎం సత్కారానికి కారణమయ్యాయి.

సంబంధిత పోస్ట్