సాలూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం రాత్రి శరన్నవరాత్రుల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, చిన్నారులు దుర్గాదేవి వేషధారణలో దర్శనమిచ్చి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కొల్లి మోక్షా నందన్ అనే చిన్నారి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసింది.