ఆలూరుదారగెడ్డ సమీపంలోని జలపాతంలో శనివారం నడి మిర్తివలస గ్రామానికి చెందిన కొండపల్లి హేమంత్ (18) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించిన హేమంత్, జారిపడి తల వెనుకభాగంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో మిర్తివలస గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ప్రస్తుతం సాలూరులో ఐటీఐ చదువుతున్న హేమంత్, తల్లిదండ్రులకు మూడవ సంతానం.