ఉప్పాడ తీరప్రాంత ప్రజల సమస్యలపై పవన్‌ సమీక్ష

AP: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉప్పాడ తీర ప్రాంత సమస్యలపై ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. 100 రోజుల ప్రణాళిక అమలుపై ఆయన చర్చించారు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని పవన్ తెలిపారు. మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెడుతున్నామని, మత్స్య సంపద పెంపునకు నిపుణుల సలహాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్