పవన్ అభిమానులకే ‘ఓజీ’ నచ్చింది: అంబటి (వీడియో)

AP: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘పవన్ నటించిన ‘ఓజీ’ చిత్రం హిట్ కొడుతుందని అనుకున్నాను. కానీ ఈ సినిమా ప్రజాదరణ పొందలేకపోయింది. కేవలం పవన్ అభిమానులకే ‘ఓజీ’ నచ్చింది. అనుకున్న స్థాయిలో ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. రాజకీయ కక్షతో తాను ఇలా చెబుతున్నట్లు జనసైనికులు, పవన్ అభిమానులు అనుకోవచ్చు. అది వారి మూర్ఖత్వం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్