AP: సుగాలి ప్రీతి మరణాన్ని పవన్ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని విమర్శలు వస్తున్నాయి. 2017లో సుగాలి ప్రీతి హత్యకు గురయ్యారు. అప్పట్లో పవన్ మౌనంగా ఉన్నారు. జగన్ సీఎం అయ్యాక 2020 ఫిబ్రవరి 11న కర్నూలులో పవన్ ర్యాలీ నిర్వహించారు. ప్రీతి హత్య కేసు పరిష్కారంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. 2024 జులై 27న ప్రీతి తల్లి పవన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరినా.. ఫలితం లేదు. దాంతో ప్రీతి మరణాన్ని పవన్ రాజకీయంగా వాడుకున్నారని టాక్ వినిపిస్తోంది.