AP: మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు కల్పించాల్సిన సౌకర్యాలపై సదుపాయాల కమిటీ సిఫార్సులతో నివేదికను మండలిలో ప్రవేశపెట్టగా.. దానికి ఆమోదం లభించింది. కమిటీ సిఫార్సులు ఈ కింది విధంగా ఉన్నాయి.
- ఏపీలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు పింఛన్ రూ.50 వేలకు పెంచాలి.
- ప్రస్తుత, మాజీ సభ్యులందరికీ అఖిల భారత సర్వీసు అధికారులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలి.
- సభ్యుల వేతనాలు, ఇతర భత్యాలను హేతుబద్ధం చేయాలి.