‘జె గ్యాంగ్‌’ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు: మంత్రి లోకేశ్‌

అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్‌సిక్స్‌ - సూపర్‌హిట్‌’సభపై ‘జె గ్యాంగ్’ చేసిన ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘సభకు వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని గ్రామాల్లో ప్రభుత్వం తరఫున చాటింపు వేయించినట్లు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేశారు. కల్యాణదుర్గంలోని అచ్చంపల్లిలో డ్వాక్రా మహిళలు సమావేశానికి రాకపోతే జరిమానా విధిస్తారనే తప్పుడు ప్రచారం చేసి వైసీపీ నేతలు ఒక ఆడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు’ అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్