AP: కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కృష్ణా పరివాహక ప్రజలు, లంక గ్రామాలవారు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల వారు అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.