అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి (వీడియో)

AP: విజయనగరం(D) గుర్ల(M) జమ్ము గ్రామంలో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు వేర్వేరుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఊరేగింపుల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో కార్యకర్తలపై పోలీసులు దాడికి దిగారని వైసీపీ ఆరోపించింది. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో భయానక వాతావరణం ఏర్పడింది. దొరికిన వారిని దొరికినట్లు కొట్టుకుంటూ జీపుల్లో ఎక్కించారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్‌తో సహా 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్