ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భారత ప్రజాతంత్ర యోజన సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై మురళి విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయరాదని, మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని ఆయన సూచించారు.