ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకొండపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా పేకాట ఆడుతుంటే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అర్బన్ సీఐ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.