ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శనివారం స్థానిక సీఐ మల్లికార్జున జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు.