ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం భక్తులకు అమ్మవారు మీనాక్షి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి, భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేశారు. మీనాక్షి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.