విద్యుత్ సబ్ స్టేషన్ లో చెలరేగిన మంటలు

ప్రకాశం జిల్లా కొండపి విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక గ్రామాల్లో అంధకారం నెలకొంది. వర్షం, చీకటితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విష పురుగులు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని కోరుతున్నారు. అధికారులు అవకాశాన్ని బట్టి విద్యుత్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్