నాలుగు టన్నుల చౌక బియ్యం పట్టివేత

జరుగుమల్లిలో ఆదివారం నాలుగు టన్నుల చౌక బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మినీ ట్రక్కులో 80 బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించి, ట్రక్కును పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణలో ఈ బియ్యాన్ని నెల్లూరు జిల్లా కావలికి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్