కొండపి: పొగనారు పెంచే రైతుల నర్సరీల దగ్గర బ్యానర్లు ఏర్పాటు

పొగాకు పంట నియంత్రణలో భాగంగా నర్సరీ దశ నుంచే నిబంధనలు అమలు చేస్తున్నట్లు టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ తెలిపారు. శనివారం కొండపి మండలం పెరిదేపిలో పొగనారు పెంచే రైతుల నర్సరీల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. నర్సరీల వద్ద రైతుల వివరాలతో కూడిన బ్యానర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్