ఆసుపత్రి ఆవరణలో గుండెపోటుతో వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అంబేద్కర్ నగర్ కు చెందిన కోటయ్యకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు విజయవాడలో సమ్మెలో ఉండటంతో అందుబాటులో లేకపోవడంతో, ఆసుపత్రి ఆవరణలోనే కోటయ్య కుప్పకూలి మృతి చెందాడు. తాత్కాలిక వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వైద్య అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్