ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో శనివారం నరసింహ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు పలు అనుమానాలు తలెత్తడంతో, సాక్ష్యాధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. సీఐ సోమశేఖర్ మాట్లాడుతూ, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.