ఆదివారం, టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలలకు రికార్డు స్థాయిలో మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేస్తుందని, గతంలో ఏ ప్రభుత్వాలు విద్యార్థులకు ఇలా మెడికల్ కిట్లు పంపిణీ చేయలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ పని చేసి చూపిస్తుందని ఆయన అన్నారు.