ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని ముత్తరాజుపాలెం వద్ద 1600 కిలోల అక్రమ రేషన్ బియ్యాన్ని ఎస్సై అనూక్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించిన ఈ బియ్యాన్ని కే. అగ్రహారం నుంచి నెల్లూరులోని కావలికి 40 బస్తాలలో అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సోమవారం అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.