ప్రకాశం జిల్లా కొండపిలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో సాదుకోటయ్య, మాల కొండయ్య అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జాళ్లపాలేనికి చెందిన భూమా బ్రహ్మరెడ్డి టంగుటూరు నుంచి కొండపికి ట్రాక్టర్ పై వస్తూ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడని స్థానిక ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు శనివారం ఆయన వెల్లడించారు.