సంగారెడ్డి జిల్లా హుత్నూర్ పోలీస్ పరిధిలోని కోనంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మనోజ్‌కుమార్‌ను హనీట్రాప్ చేసి ₹11.20 లక్షలు వసూలు చేసిన ఘటనలో ప్రకాశం జిల్లా మార్కాపురం యువకుడు సంజయ్ సహా పలువురిని సంగారెడ్డి సీసీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేయించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.