ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం 15వ వార్డులో పర్యటించి మీడియాతో మాట్లాడుతూ, కూటమి పాలనతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, జిఎస్టి తగ్గింపుతో కుటుంబాలకు మరింత మేలు చేకూరుతుందని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.