మెడికల్ కళాశాలను పరిశీలించిన ప్రజాసంఘాల నాయకులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను శనివారం ప్రజాసంఘాల నాయకులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ వ్యతిరేకించారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 500 కోట్లు మాత్రమే అవుతుందని, ఆ నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవా అని ఆయన ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్