మార్కాపురంలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం, అటవీశాఖ అధికారులు విద్యార్థులతో అడవులు, వన్యప్రాణులను సంరక్షిస్తామని ప్రమాణం చేయించారు. ఈనెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహించినట్లు అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి తెలిపారు. వన్యప్రాణులు జీవిస్తేనే మానవ మనుగడ సాధ్యమని ఆయన విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్