డిజిటల్ బుక్ ఆవిష్కరించిన వైసిపి నాయకులు

ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంగోలులోని వైసిపి కార్యాలయంలో ఈ డిజిటల్ బుక్ పాంప్లెట్ ను ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తలకు ఇబ్బంది కలిగించిన వారిని వదిలిపెట్టేది లేదని, ప్రజలు కూడా తమ సమస్యలను ఈ డిజిటల్ బుక్ లో తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు వైసిపి కీలక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్