ఎత్తిపోతల పథకంలో హౌస్ లోకి వరద నీళ్లు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయి. ముండ్లమూరు మండలంలోని తూర్పుకంభంపాడు గ్రామంలో గుండ్లకమ్మ నదిపై 30 ఏళ్ల క్రితం నిర్మించిన మూడు ఎత్తిపోతల పథకాల్లోకి వరద నీరు చేరింది. భట్లపల్లి పథకం పరిధిలోని 550 ఎకరాలు, మరో పథకం పరిధిలోని 200 ఎకరాలు, శ్రీరామా ఎత్తిపోతల పథకం కింద 325 ఎకరాలకు నీరందించే ఈ పథకాలలోని మోటార్లు, ప్యానల్ బోర్డులు నీటిలో మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. వాగులపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

సంబంధిత పోస్ట్