పాల కేంద్రపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు

ప్రకాశం జిల్లా దర్శిలోని పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. సాధారణ తనిఖీలలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు ప్రకాశం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ తెలిపారు. దర్శిలోని కొన్ని డైరీల నుండి పాల కేంద్రాల నుండి శాంపిల్స్ సేకరించి, హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్స్ ఆధారంగా ఆయా కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్