ప్రకాశం జిల్లా దర్శిలో ఆదివారం రాత్రి గడియార స్తంభం సెంటర్ వద్ద మహిళల వన్డే క్రికెట్ మ్యాచ్ ప్రసారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆమె మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని, దేశ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు ఎంతో ఆత్రుతగా వీక్షించారు.