కూలిన మట్టి మిద్దెలు రేకుల ఇల్లు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మంతా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. తుఫాను బీభత్సంతో దాదాపు 15 మట్టి మిద్దెలు, రేకుల ఇళ్లు కుప్పకూలాయి. రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, కంభం పరిసర ప్రాంతాలలో ఈ నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. తుఫాను కారణంగా నిలువ నీడను కోల్పోయిన తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్