ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట మండలాల్లో కలెక్టర్ రాజాబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి సందర్శించారు. మునిగిపోయిన పంటలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పిన కలెక్టర్, పంట నష్టంపై అంచనా వేసి సీఎంకు నివేదిక పంపుతామని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కంభం చెరువు అలుగు పారడంతో పంట పొలాలు మునిగిపోయాయని రైతులు వినతిపత్రం ఇవ్వగా, నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, సమర్థవంతమైన నాయకత్వం, అధికారుల కృషితో తుఫాను పరిస్థితులను ఎదుర్కొన్నామని, బాధితులకు సహాయం అందేలా చూస్తామని తెలిపారు.