ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డంపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న రూ. 65 వేల నగదు మూడు తులాల బంగారాన్ని అపహరించారు. బాధితులు దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని ఆదివారం అర్బన్ సీఐ సురేష్ వెల్లడించారు.