ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో శనివారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తుందని, ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.