రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. దైవదర్శనం నిమిత్తం ఓంకారం వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్