ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించి, తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి సందర్శించారు. పంట నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి, రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే అధికారులకు నివేదిక తయారు చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.