ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని భైరవకోన ఆలయ ప్రాంతంలో ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇటీవల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకృతి ప్రేమికులు దీనిని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నారు, మరికొందరు ఆ నీటిలో స్నానం చేస్తూ సేద తీరుతున్నారు.