భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రకాశం జిల్లాలోని శివాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా పామూరులోని శ్రీ వల్లి భుజంగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి, శ్రీ వల్లి భుజంగేశ్వర స్వామికి పాలతో, నెయ్యితో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో నరసింహ బాబు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి, దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్