ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో శుక్రవారం పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 19,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.