ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సుందర్ నగర్ లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1640 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి, చట్టరీత్యా నేరమని ప్రజలను హెచ్చరించారు.